FbTelugu

ఎపి లో కేసులు 11 వేలే…

అమరావతి: ఎపి లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,303 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

24 గంటల్లో కరోనాతో 104 మరణాలు సంభవించగా 18,257 మంది రికవరీ అయ్యారు. అదే విధంగా 93,704 మందికి కరోనా పరీక్షల నిర్వహించినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 8, విశాఖ జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. కృష్ణ, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కడప జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందినట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.