FbTelugu

పిడుగులతో 11 మంది మృతి

పాట్నా: బిహార్ రాష్ట్రంలో పిడుగు పాటుకు 11 మంది చనిపోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మంది పిడుగుపాటుకు చనిపోయారు.

రాష్ట్ర విపత్తు అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో 339 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణం కన్నా ఇది 139శాతం ఎక్కువ. భారీ వర్షాలకు ఉత్తర బిహార్ లోని వెస్ట్ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్ గంజ్, సరన్ జిల్లాల్లో వరదలు వచ్చాయి. సుమారు 65 గ్రామాల్లో 80 వేల మందిపై వరద ప్రభావం పడింది. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్ జిల్లాల్లో ఆరుగురు, పాట్నాలో ఇద్దరు, నలందా, మాధేపుర, ఔరంగాబాద్ లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు చనిపోయారని అధికారులు తెలిపారు. తూర్పు చంపారన్ లో నలుగురు, పాట్నాలో ఇద్దరు చొప్పున గాయపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.