FbTelugu

ఒకే కుటుంబంలో 11మంది ఆత్మహత్య?

జైపూర్: ఎంత కష్టం, నష్టం వచ్చిందో తెలియదు కాని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. దేచు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లోహ్దాటా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా చంపారా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు ఉదయం ఒకే కుటుంబానికి చెందిన 12 మంది విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 11 మంది మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కుటుంబ స‌భ్యులంద‌రూ ఒకే సారి ఆత్మహత్య చేసుకోవ‌డం మిస్ట‌రీగా మారింది. ప్రాణాలతో ఉన్న ఆ వ్య‌క్తిని స‌మీపంలోని ఆస్ప‌త్రిలో చేర్పించారు.

పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్ కు చెందిన ఓ కుటుబం హిందూ శ‌ర‌ణార్థులు గా కొన్నేళ్ల క్రితం లోహ్దాటా గ్రామం వ‌చ్చింది. కుటుంబ స‌భ్యులంతా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాస‌న వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై దేచ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

You might also like