FbTelugu

11న జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ఈనెల 11వ తేదీన జిల్లా కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన కీలక అంశాలను చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు క్రమబద్దీకరణ, రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్ బీ చేర్చిన అంశాల పరిష్కారం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ రూపొందిస్తారు. దీంతో పాటు కరోనా వ్యాక్సిన్ , పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.