FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 10,667 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 380 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3,43,091 కి చేరింది. కాగా దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 9,900 లకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో చైనా నాల్గవ స్థానంలో ఉంది. కరోనా మరణాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది.

You might also like