FbTelugu

105 కేజీల వెండి పట్టివేత

కర్నూలు: పోలీసు తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 105 కేజీల వెండి పట్టుబడిన ఘటన జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా..

కందన్, భారతి అనే ఇద్దరు నిందితులు కారులో తరలిస్తున్న 105 కేజీల వెండిని, వారి వద్దనుంచి 2 లక్షల రూపాయల నగదును స్వధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసినట్టు తెలిపారు. నిందితులు వెండిని హైదరాబాద్ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.