FbTelugu

తెలంగాణలో 1016 కి చేరిన కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 1,016 కు చేరింది. నిన్న ఒక్కరోజే 35 మంది కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409 కి చేరింది.

నేటివరకు తెలంగాణలో 25 మంది కరోనాతో మృతి చెందారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 582 గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తుండడంతో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. కొత్త కేసుల నమోదు శాతం కూడా చాలావరకు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి.

You might also like