FbTelugu

100 గదుల సత్రం నిర్మించాలి: ఎంపీ రఘురామ

అమరావతి: అయోధ్యలో 100 గదుల సత్రాన్ని నిర్మించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ రఘురామ కృష్ణం రాజు కోరారు. ఇవాళ ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను సీఎంకు తెలిపారు.

ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు వసతి కల్పించాలని కోరారు. భక్తుల విరాళాలతో టీటీడీ సత్రాలు నిర్మిస్తున్నట్టుగా.. అయోధ్యలో 100 గదుల సత్రాన్ని నిర్మించాలని కోరారు. ఇందుకు గానూ అయోధ్యలో 3 ఎకరాల భూమిని ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు. దీనిపై కేబినెట్ భేటీలో తీర్మాణం చేయాలని కోరారు.

You might also like