FbTelugu

100 రోజుల తరువాత మృతదేహం వెలికి తీత!

రియాద్: తమ సాంప్రదాయానికి విరుద్ధంగా తన భర్త మృతదేహాన్ని ఖననం చేశారంటూ ఒక మహిళ కోర్టును ఆశ్రయించి చివరి కోరికను సాధించుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు వంద రోజుల తరువాత మృతదేహాన్ని బయటకు తీసి భార్యకు అప్పగించారు.
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ (49) 23 సంవత్సరాలుగా సౌదీలో పనులు చేస్తున్నాడు. జనవరి 24వ తేదీన గుండెపోటు రావడంతో బిష్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచాడు.

జెడ్డాలోని భారత రాయబారి కార్యాలయంలో పనిచేస్తున్న ట్రాన్స్ లేటర్ తప్పిదంతో సంజీవ్ ను ముస్లింగా గుర్తించి, ఆ ప్రకారంగానే ఖననం చేశారు. ఈ విషయం ఇండియాలో ఉంటున్న భార్యకు తెలియడంతో షాక్ కు గురైంది. న్యాయం చేయాలంటూ సంజీవ్ భార్య అంజూ శర్మ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు సంజీవ్ మృతదేహాన్ని ఇండియాలో ఉంటున్న భార్యకు అప్పగించాలని తీర్పు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశం మేరకు సౌది అరేబియా అధికారులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వంద రోజుల తరువాత బయటకు తీశారు. కార్గో విమానంలో ఢిల్లీకి తరలించారు. విదేశాంగ శాఖ అధికారులు ఢిల్లీ ఏయిర్ పోర్టులో సంజీవ్ మృతదేహాన్ని భార్య అంజూశర్మకు అప్పగించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.