FbTelugu

ప్రతి పరీక్షా కేంద్రంలో 10 మంది విద్యార్థులు

ఏపీ విద్యా శాఖ మంత్రి సురేష్ వెల్లడి

విజయవాడ: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

కోవిడ్-19 నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్హహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విజయవాడ లోని సమగ్ర శిక్షా కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండే విదంగా చర్యలు తీసుంటామని సురేష్ తెలిపారు.

దీనివల్ల గతంలో అనుకున్న 2882 పరీక్షా కేంద్రాలకు 44 శాతం అదనంగా అంటే మొత్తం 4154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి గదిలో మాస్క్ లు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు 8 లక్షల మాస్క్ లు విద్యార్థులకోసం సిద్ధం చేస్తున్నామన్నారు. టీచింగ్ స్టాఫ్ కు పరీక్షా కేంద్రాల్లో గ్లౌజు లు కూడా ఇస్తామని మంత్రి అన్నారు.

ప్రతి కేంద్రం లో ఒక థర్మల్ స్కానర్ ఉండే విధంగా దాదాపు 4500 స్కానర్ లు అందుబాటులో పెడుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్ జోన్ లలో పరీక్షా కేంద్రాలు లేవని, ఒకవేళ ఇప్పుడున్న కేంద్రాల వద్ద కొత్తగా కరోనా కేసులు వచ్చి అవి కంటైన్మెంట్ జోన్ ల లోకి వెళితే వాటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండేలా అధికారులను సమాయత్తం చేశామని మంత్రి సురేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.