FbTelugu

రూ.10 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

భూపాలపల్లి: నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు దుండగులు కారులో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారినుంచి రూ.10 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like