FbTelugu

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

లక్నో: బస్సు, లారీ, మరో వాహనం ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెంది, మరో 25 మందికి తీవ్ర గాయాలైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక పోవడంతో యూపీలోని ఆగ్రా–మొరాదాబాద్ జాతీయ రహదారిపై ఓ బస్సు, ఓలారీ మరో వాహనం బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.