FbTelugu

లారీని ఢీకొట్టిన ఆర్టిసి బస్సు… 10 మందికి గాయాలు

మహబూబ్ నగర్: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో శనివారం రోడ్డుప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టిసి బస్సు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టిసి బస్సు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారిస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ స్థంభించకుండా చర్యలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.