FbTelugu

లాక్ డౌన్ తో 1.96 లక్షల కేసులే

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఫలితాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నెల రోజుల తరువాత రోజువారి కేసులు రెండు లక్షలకు దిగువకు చేరాయి. దీంతో పాటుగా మరణాల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది.

సోమవారం 20,85,112 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,96,427మందికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. గడచిన 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించగా ఇప్పటి వరకు 3,07,231 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరగా.. యాక్టివ్ కేసులు 25,86,782 ఉన్నాయి. నిన్న 3,26,850 మంది వైరస్‌ నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 2.4 కోట్లకు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69 శాతంగా కొనసాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.