FbTelugu

1.47 కోట్ల మందికి ఉచిత రేషన్: మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపథ్యంలో అర్హులైన అందరికీ ఉచితంగా రేషన్, వెయ్యి రూపాయలు అందించనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర మంత్రి కన్నబాబు పొల్గొని మాట్లాడారు.

ఏపీలో 1,47 లక్షల మందికి ఉచిత రేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. నిత్యావసరాలు, రేషన్ లోటు ఉందని, స్టాక్ లేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పక పోయినా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.1000 అందిస్థామని తెలిపారు. రైతు మార్కెట్ల పై కూడా నిత్యం పర్యవేక్షణ ఉన్నట్టు తెలిపారు.

You might also like