FbTelugu

హోంమంత్రి సభలో ఆర్టీసీ కార్మికుల నిరసన

RTC-workers-protest-in-Home-Ministers-Meeting

సంగారెడ్డి: హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీకి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తగిలింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మై నేషన్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభోత్సవికి వచ్చిన హోం మంత్రి శాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సభా ప్రాంగణంలో నినాదలు చేయడంతో పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తరువాత సంగారెడ్డి లోని పాత జైలు సముదాయంలో ఖైదీల ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ పెట్రోలియం సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మై నేషన్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు.

You might also like