FbTelugu

హిమాచల్ ప్రదేశ్ లో కంపించిన భూమి

సిమ్లా: ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడ్డారు. ముఖ్యంగా కాంగ్రా, చంబా ప్రాంతాల్లో భూమి అధికంగా కంపించినట్టు సమాచారం.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ తీవ్రతలో సంభవించే ప్రకంపనలు అంత ప్రమాదకరం కాదని తెలిపారు.

You might also like