FbTelugu

సోనూసూద్ కు చేదు అనుభవం

ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ కు స్థానిక బాంద్రా రైల్వే స్టేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. వలస కార్మికులను కలవడానికి సోనూ సూద్ రైల్వే స్టేషన్ కు వెళ్లగా అక్కడ కొందరు సిబ్బంది అతన్ని అడ్డుకుని అక్కడకు వెళ్లనివ్వలేదు.

లాక్ డౌన్ లో చిక్కుకు పోయిన వలస కార్మికుల పాలిట దేవునిగా మారిన సోనూసూద్ ప్రత్యేక బస్సులు, రైలు సదుపాయాలు, ఆఖరికి విమానాల్లో కూడా వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే సోనూ సూద్ ను ఆపింది తాము కాదని ముంబై పోలీసులు వివరణ ఇచ్చారు. అతన్ని రైల్వే రక్షకదళ సిబ్బంది ఆపినట్టు తెలిపారు.

You might also like