FbTelugu

సర్ధి చెప్పిన యువకునిపైనే కత్తులతో దాడి

విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా గ్రూప్ వార్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. విజయవాడలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కత్తుల దాడి మరువక ముందే విశాఖలో రెండు గ్రూపులు క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో కొట్టుకున్నారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఓ యువకునిపై కత్తులతో దాడికి దిగారు.

స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కొత్తూరులోని ఓ క్రికెట్ గ్రౌండ్ లో ఆటాడుతున్న రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో సాయి అనే యువకుడు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో సూర్య అనే మరో యువకుడు సాయిపై కత్తులతో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like