FbTelugu

షాకిస్తున్న కరెంటు బిల్లులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వచ్చిన కరెంటు బిల్లులను చూసి ప్రజలు షాక్ కు గురౌతున్నారు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా కరెంటు బిల్లులు ఇవ్వలేదు. తాజాగా లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో బిల్లులను రీడింగ్ ఆధారంగా ఇస్తున్నారు. అయితే గత నెలలో ఎంత బిల్లువస్తే అంత లాక్ డౌన్ నెలల్లో చెల్లించమని విద్యుత్ సంస్థలు సూచించాయి.

కాగా ప్రస్తుతం రెండు నెలల రీడింగ్ ను కలిపి బిల్లులు ఇస్తుండడంతో యూనిట్లు పెరిగిపోయి, స్లాబ్ లు మారిపోయి బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అయితే విద్యుత్ సంస్థలు మాత్రం వేసవి, లాక్ డౌన్ కారణంగా ప్రజలు మొత్తం ఇంటివద్దే ఉండడం, వర్క్ ఫ్రం హోం వంటి కారణాలతో విద్యుత్ వినియోగం పెరిగి కరెంటు బిల్లులు పెరిగినట్టు తెలుపుతున్నారు.

You might also like