FbTelugu

శ్రీశైల ఆలయ నిధుల స్కామ్.. 26 మంది అరెస్టు

శ్రీశైలం ఆలయ నిధుల స్కామ్ లో 26 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలంలో భక్తుల దర్శన టికెట్లు, వసతి చార్జీలు, కుంకుమార్చన టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో సుమారు కోటి రూపాయల వరకు స్కాం జరగినట్టుగా అధికారులు గుర్తించారు.

ఆలయ సిబ్బంది ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకోవడంతో అసలు గుట్టు బయటపడ్డట్టు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు ఆలయ సిబ్బంది ఉండగా, 23 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారి నుంచి రూ.33 లక్షల 40 వేల నగదును, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

You might also like