FbTelugu

వోడాఫోన్ ఓడిపోయింది…

Vodafone-lost--

ముంబై: ఇండియా టెలికాం సంస్థ వోడాఫోన్ వ్యాపారం నుంచి తప్పుకోనుందా అంటే తప్పుకోనుందనే సమాచారం వస్తోంది. త్వరలోనే మూటాముళ్లె సర్దుకుని ప్యాకప్ కావాలని వోడాఫోన్ నిర్ణయించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఊటంకించింది. గత కొద్ది నెలలుగా నష్టాల బాట పడుతుండడంతో ఇక లాభం లేదని, మూసివేయడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది. నూతన కష్టమర్లు పెరగకపోవడం, నిధులు కరుగుతుండడం, నిధుల సమీకరణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సుమారు 4వేల కోట్ల డాలర్లను నష్టపోయింది. ఒక త్రైమాసికానికి మరో త్రైమాసికానికి మధ్య రుణభారం పెరుగుతుండడంతో రుణదాతల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇండియాలో వోడాఫోన్ మూసివేయడానే మొగ్గు చూపుతున్నది.

You might also like