FbTelugu

వస్త్రాల షోరూంలో అగ్ని ప్రమాదం

విజయవాడ: వస్త్రాల షోరూంలో ప్రమాదవ శాత్తూ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థానిక బెంజి సర్కిల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బెంజి సర్కిల్ లోని రిలయన్స్ షోరూంలో ప్రమాదవ శాత్తూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దీంతో ఆ ఫ్లోర్ లోని పాదరక్షల షాపు, వస్త్రాల షాపు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

You might also like