FbTelugu

రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం

హైదరాబాద్: రానున్న రెండ్రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ముఖ్యంగా ఉత్తరాధ్రంలో అధికంగా వర్షాలు పడనున్నట్టు తెలిపింది. రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

You might also like