FbTelugu

రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ దరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా పెట్రోల్ లీటర్ పై 24 పైసలు, డిజిల్ పై 29 పైసలు పెంచాయి. పెరిగిన ధరలతో ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.68, డీజిల్ లీట్ రూ.84.61 చేరుకున్నది.
ముంబైలో పెట్రోల్ రూ.99.94, డీజిల్ రూ.91.87 గా, హైదరాబాద్ లో పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.32గా ఉంది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి, ఫలితాలు రాగానే ఇంధన సంస్థలు ధరలు పెంచుతూ వచ్చాయి. అంతకు ముందు రెండు వారాల పాటు పెంచకుండా మౌనం వహించాయి. కేంద్రం పెంచమని చెబితే పెంచడం, వద్దంటే ఆగిపోవడం చమురు సంస్థలకు ఆనవాయితీగా వస్తున్నది. ఎన్నికల ఫిలితాల తరువాత ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పై రూ.3.33, డీజిల్ పై రూ.రూ.4 వరకు పెంచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.