FbTelugu

యుఎస్ లో పేలిన తుపాకీ… 8 మంది మృత్యువాత

వాషింగ్టన్: అమెరికా దేశంలో మళ్లీ తుపాకీ పేలింది. ఒక అగంతకుడి కాల్పుల్లో ఎనిమిది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… పలువురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కాలిఫోర్నియాలోని శాన్ జోన్ లో పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యార్డులో చోటు చేసుకున్నది.

ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని శాంట్లాకార్లా కౌంటీ పోలీసులు తెలిపారు. నిందితుడు వ్యాలీ ట్రాన్స్ పోర్టు అథారిటీ ఉద్యోగి సామ్ కాసిడి (57) గా గుర్తించామన్నారు. కాంపౌండ్ లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బాంబ్ స్క్యాడ్ మోహరించిందని శాంట్లాకార్లా కౌంటి షెరీఫ్ డిప్యూటీ రస్సెల్ డేవిస్ పేర్కొన్నారు. అగంతకుడి కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారని, మృతుల సంఖ్య ఇంక పెరుగుతుందన్నారు. సిలికాన్ వ్యాలీ టెక్ హబ్ గా ఉన్న ఈ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఘటనకు ముందు యూనియన సమావేశం జరగ్గా, 80 మంది సిబ్బంది పాల్గొన్నారని రస్సెల్ డేవిస్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.