FbTelugu

మా కష్టాలు సినీ ప్రముఖులకు పట్టవా: రైతులు

అమరావతి: ఇవాళ అమరావతిలో టాలీవుడ్ సినీ ప్రముఖుల గెస్ట్ హౌస్ ల ముందు అమరావతి రైతుల ఆందోళనకు దిగారు. రైతుల గురించి ఎంతో గొప్పగా సినిమాలు తీస్తుంటే ఆ సినిమాలను, సినీ ప్రముఖులను ప్రజలు ఆధరిస్తున్నారని కానీ రైతులు అమరావతి రైతులు కొన్ని నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుంటే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.

తమకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సినీ ప్రముఖులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లమని చెప్పడానికి వస్తే తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. వాళ్లకు నిబందనలు అడ్డు రావు.. తాము బయటకొస్తే పోలీసులకు నిబందనలు అడ్డువస్తున్నాయని రైతులు వాపోయారు.

You might also like