FbTelugu

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలో ట్విస్ట్

కృష్ణా: జిల్లాలోని కంచికచర్లలో నిన్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణలో భర్త, మరిది కలిసి హత్య చేసినట్టుగా  తేలినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్ భర్త నాగశేషు, మరిది శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యను ఎందుకు చేశారన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ కేసుపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like