FbTelugu

భారీగా పట్టుబడిన పేలుడు పదార్థాలు

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం గొట్లూరు వద్ద భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్లూరు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. 500 జిలెటిన్ స్టిక్స్, 500 డిటోనేటర్లు పట్టుబడ్డాయి.

దీంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like