FbTelugu

భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 52,123 కేసులు నమోదైనాయి.

అదే సమయంలో 775 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 34,968 కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 5,28,242 ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 10,20,582 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like