న్యూఢిల్లీ : భారత్, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్య ఇవాళ పలు ఆన్ లైన్ ఒప్పందాలు కుదిరాయి. కరోనా నేపథ్యంలో భారత ప్రధాని విదేశీ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మోరీస్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్ లైన్ లో చర్చలు జరిపారు.
ఈ భేటీలో ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్టు తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలంలో మోదీ నాల్గవసారి ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు జరిపారు.