FbTelugu

పల్లె ప్రగతిపై మూడు జిల్లాల్లో తనిఖీలు

హైదరాబాద్: రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు  ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బయలుదేరారు.

గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బేగంపేట విమానాశ్రయం నుంచి సోమేష్ కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో బయలుదేరి కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు.

జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ .308 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తోంది. పర్యటన సందర్భంగా పారిశుధ్యం, డంప్ యార్డులు, శ్మశానవాటిక, నర్సరీ, టికెహెచ్‌హెచ్‌పై సమీక్షించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

You might also like