FbTelugu

నేను నటించానన్న కారణంతోనే ఆ సీన్ ను వివాదాస్పదం చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం విడుదల అయిన దగ్గరనుంచి మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఈ సినిమాలోని ఓ చెంపదెబ్బ సీన్ మాత్రం వివాదాస్పదం అయింది. ఈ సీన్ లో హిందీ మాట్లాడుతున్న ఓ వ్యక్తిని పోలీసు అధికారి అయిన ప్రకాశ్ రాజ్ చెంపపై కొడతాడు. హిందీ భాష మాట్లాడేవారిని ఈ సన్నివేశం ద్వారా అవమానించారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

‘జై భీమ్’ చిత్రం ఇతివృత్తాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం ఓ చెంపదెబ్బ సన్నివేశాన్ని వివాదంగా మార్చుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జై భీమ్’ చిత్రంలో పీడితవర్గాల సమస్యలను, వారి కష్టాలను చూపించామని, కానీ కొందరు అసలు విషయాన్ని వదిలేసి చెంపదెబ్బ సీన్ ను విమర్శించడం చూస్తుంటే వాళ్ల ఉద్దేశం ఏంటో అర్థమవుతోందని తెలిపారు.

ఈ సినిమాలో నేను నటించానన్న కారణంతోనే ఆ సీన్ ను వివాదాస్పదం చేస్తున్నారు అంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఇటువంటి వివాదాలపై స్పందించడం కూడా అనవసరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మలయాళ నటి లిజోమోల్ జోస్ కీలకపాత్ర పోషించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.