FbTelugu

నిమ్స్ డాక్టర్లను పరామర్శించిన గవర్నర్

హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న నిమ్స్ డాక్టర్లు, మెడికల్ సిబ్బందిని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.

నిమ్స్ హాస్పిటల్ ను గవర్నర్ సోమవారం నాడు సందర్శించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను నిమ్స్ డైరెక్టర్ డా.మనోహర్ చికిత్స పొందుతున్న డాక్టర్ల వార్డు వద్దకు తీసుకువెళ్లారు. చికిత్స తీసుకుంటున్న డాక్టర్లతో ఆమె మాట్లాడారు.

నిమ్స్‌లో ఇప్పటి వరకు నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్‌ వైద్యులు, 8 మంది పారామెడికల్‌ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వైద్యులు, వైద్య సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

telangana governor

You might also like