FbTelugu

నాథురాం గాడ్సే దేశభక్తుడే: నాగబాబు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు సంచలన ట్వీట్ చేశాడు.

ఆయన చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే లేపుతోంది. జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అని కీర్తించారు. ఈరోజు గాడ్సే పుట్టిన రోజు. మహాత్మా గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చించదగ్గదే. ఆయన గాంధీని చంపిన సమయంలో తన వాదనను ఏ మీడియా కూడా చెప్పలేదన్నారు.

ఆ రోజులో మీడియా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసింది. ఈ రోజుల్లో కూడా చాలా వరకు అదే పరిస్థితి కొనసాగుతున్నది. గాంధీని చంపితే అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేశాడన్నారు. అయినా నాథురాం గాడ్సే దేశభక్తిని శంకించలేమన్నారు. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు కూడా. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేసుకోవాలని అనిపించింది. పాపం అంటూ… మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని నాగబాబు ట్వీట్ ముగించారు.

నాగబాబు అన్న చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండగా, తమ్ముడు పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించి ఇటీవలే బీజేపీతో చేతులు కలిపారు. ఏపీలో రెండు పార్టీలు కలిసి నడుస్తాయని ప్రకటించారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి, ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రివర్గలో చేరారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో తిరిగి సినిమాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నాగబాబు కొన్ని టీవీ ఛానళ్లలో వినోద కార్యక్రమాల జడ్జీగా వ్యవహరిస్తున్నారు.

You might also like