FbTelugu

నాగ్ సినిమాను వదులుకున్న అమలా పాల్!

నాగ్ సినిమాను వదులుకున్న అమలా పాల్!
అమలా పాల్ అగ్ర కథానాయికగా చాలా తక్కువ గ్యాపులోనే మలయాళ .. తమిళ .. తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకుంది. అయితే మొదటి నుంచి కూడా ఆమె తమిళ .. మలయాళ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే. వాటిలో ‘నాయక్’ .. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గినట్టు ఉంది పరిస్థితి చూస్తే. అయినా ఆమె నాగార్జున సరసన నాయిక పాత్రను వదులుకుందని అంటున్నారు. నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె చేయలేనని చెప్పింది.

దాంతో కథానాయికగా అమలా పాల్ ను అడిగితే, పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసిందని చెబుతున్నారు. సీనియర్ హీరోల జోడీగా హీరోయిన్స్ దొరకని ఈ పరిస్థితుల్లో అమలా పాల్ ఒప్పుకుని ఉంటే, ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.