FbTelugu

ధర్మాసనం ముందుకు మున్సిపల్ పిటీషన్లు

Municipal-petitions-ahead-of-the-jury

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. పెండింగ్ లో ఉన్న పిటీషన్లను అత్యవసరంగా కొట్టివేయాలని సింగిల్ జడ్జిని ప్రభుత్వం కోరింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మున్సిపల్ ఎన్నికలపై వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొట్టి వేసిందని సింగిల్ జడ్జి దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ప్రభుత్వ అభ్యర్థన పై పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో పేర్కొన్న అంశాలు, తమ రిట్ పిటిషన్లలో అంశాలు వేర్వేరుగా ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. దాఖలైన పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుంచుతామని హైకోర్టు సింగిల్ జడ్జి తెలిపారు.

You might also like