FbTelugu

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు: బండిసంజయ్

హైదరాబాద్: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటివరకూ గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.