FbTelugu

దేశంలో లాక్ డౌన్ విఫలమైంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. లాక్ డౌన్ తో దేశంలో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని రాహుల్ బజాజ్ అన్నారు.

కోవిడ్ పై ప్రచారం చేయడంలో వెనకబడ్డామని తెలిపారు. వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రజలను సాధారణ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

You might also like