FbTelugu

తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

షరతులు వర్తిస్తాయి

అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు త్వరలో తెరుచుకోనున్నాయి. దేవాలయాలు తెరచిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా నిబంధనలు పాటిస్తూ  దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు పూర్తిగా ఆన్ లైన్ లోనే దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా చూడాలని సూచించింది. భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్)పాటిస్తూ దర్శనం చేసుకునేలా నియంత్రించాలి. ఆన్ లైన్ లోనే దర్శనానికి సంబందించిన టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి.

ప్రతి ఆలయంలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ తో పాటు శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు గుడి పరిసరాలు, క్యూ లైన్ ప్రాంతాలు సోడియం హైపో క్లోరైడ్ తో స్ప్రే చేయాలి. ప్రతి దేవాలయంలోన ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.