FbTelugu

ట్రైన్ లో వంటలు…62 మంది మృతి

62-killed-as-fire-engulfs-express-train

లాహోర్: కరాచి నుంచి రావల్పిండి వెళ్తున్న టెజ్గాం ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రమాదంలో 62 మంది మృతి చెందారు. ట్రైన్ బోగీలలో గ్యాస్ స్టౌ మీద వంటలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారు. కూరలు వండేందుకు సిద్దమవుతున్న తరుణంలో వంట నూనెలకు గ్యాస్ మంటలు తోడుకావడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు మూడు బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మంటలకు భయపడి పలువురు బోగీల నుంచి దూకడంతో మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

సాధారణంగా పాకిస్థాన్ ట్రైన్లలో దూర ప్రాంతం వెళ్లేవారు బోగీలలో వంటలు చేయడం సాధారణమని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ లలో ఇలాంటి ఘటనల్లో పలువురు చనిపోయారన్నారు. 2005 సంవత్సరం సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ట్రైన్ ప్రమాదంలో 130 మంది మరణించారని ఆయన వివరించారు.

You might also like