FbTelugu

టెన్త్ పరీక్షా కేంద్రాలపై మెస్సేజీలు

మాస్క్ లు, గ్లౌజులు ఉంటేనే అనుమతి

హైదరాబాద్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 నుంచి జూలై 5 వరకు జరగనున్నట్లు షెడ్యూలు ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పరీక్షా కేంద్రాల్లో సమూల మార్పులు చేస్తున్నారు. గతంలో ఒకే కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటించాల్సి ఉన్నందున పరీక్షా కేంద్రాలు రెట్టింపు అవుతున్నాయి.

కొత్తగా ఏర్పాటు చేయనున్న పరీక్షా కేంద్రాల సమాచారాన్ని సంబంధిత విద్యార్థికి మెస్సేజీ ద్వారా పంపించనున్నారు. పరీక్షకు ఒకరోజు ముందు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ సమాచారం పంపిస్తారు. ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేశారు.

పరీక్షల ప్రారంభానికి ముందే విద్యార్థులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్తే కేంద్రం ఎక్కడ ఉందనేది స్పష్టమవుతుంది. జూన్ 7 నుంచే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీస్ బోర్డులో అందుబాటులో పెట్టనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వడంతో పాటు అదే రోజు వెళ్లినా సమీపంలోని(కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కాస్త ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

కరోనా జాగ్రత్తల్లో భాగంగా ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ఉంటేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోనికి అనుమతించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.