FbTelugu

టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైఎస్.జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించారు.

టెన్త్‌ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని చెప్పారు.

తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో నాడునేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించారు. డ్యూయల్ డెస్క్ లు, ఫ్యాన్లు, తాగునీటి శుద్ధి కోసం ఏర్పాటు చేయనున్న ఫిల్టర్లను జగన్ కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

You might also like