FbTelugu

జూన్ 22 వరకు టికెట్లన్నీ బుక్

ఢిల్లీ: దేశంలో కరోనా నేపథ్యంలో విధించి లాక్ డౌన్ కారణంగా గత కొంతకాలంగా అన్ని రవాణా వ్యవస్థలను పూర్తిగా నిలిపివేశారు. తాజాగా లాక్ డౌన్ కు కొన్ని సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో వలస కార్మికులు ఒక్కసారిగా రైళ్లకోసం క్యూ కట్టారు.

కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. కాగా పాత ఢిల్లీలో ఇవాళ కూడా అనేక మంది వలస దారులు టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్లగా జూన్ 22 వరకు టికెట్లన్నీ బుక్ అయినాయని రైల్వే అధికారులు ప్రయాణికులను వెనక్కి పంపుతున్నారు. దీంతో తమకు తింటానికి కూడా తిండి లేదని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తమను ప్రభుత్వం సొంత ప్రాంతాలకు పంపాలంటూ వేడుకుంటున్నారు.

You might also like