FbTelugu

జర్నలిస్టులపై 2 వారాల్లో కౌంటర్ వేయాలి: హైకోర్టు

హైదరాబాద్: కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను (పిల్)  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్, లాక్ డౌన్ వార్తలను కవర్ చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటీషనర్ కోర్టుకు తెలిపారు.

పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని విన్నవించారు.

జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలన్నారు. వాదనలు విన్న హైకోర్టు, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల ముఖ్య కార్యదర్శి, ఐ అండ్ పీఆర్ కమిషనర్, మీడియా అకాడెమీ ఛైర్మన్ కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్. ప్రసాద్ తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

You might also like