FbTelugu

చివరి షెడ్యూల్ లో మహేష్ బాబు సర్కారువారి పాట

పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఫోర్టీన్ రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా, చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మేజర్ పార్ట్ దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో ఈ సినిమా షూటింగు జరుపుకుంది. దుబాయ్ .. గోవా షెడ్యూల్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్పెయిన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను చిత్రీకరించారు.

ఇక ఫైనల్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్ నడుస్తుందట. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ 2022 జనవరి 13 నుంచి ఏప్రిల్ 1కి వెళ్ళింది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.