FbTelugu

ఘోరం.. మృతురాలిపై అత్యాచారం

మామూలుగా చిన్నపిల్లలపై, ముసలివారిపై రేప్ కేసుల గురించి వినే ఉంటాం.. కానీ ఓ మహిళా శవంపై కూడా అత్యాచారం చేసిన దారుణ ఘటన పాకిస్థన్ లో చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాక్ లోని ఓ ప్రముఖ పట్టణానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోవడంతో శనివారం స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆదివారం ప్రార్థనలు చేసేందుకు ఆమె సమాధి వద్దకు వెళ్లగా.. మృతదేహం బయటపడి ఉండటం చూసి షాక్ అయ్యారు. నిశితంగా పరిశీలించగా.. మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కాటి కాపరి పరారీలో ఉన్నాడు.

You might also like