FbTelugu

గ్యాస్ బాధితుల డిశ్చార్జీ

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీకై 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు.

బాధితులంతా విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్నవారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.అర్జున ప్రకటించారు. వీరందరినీ డిశ్చార్జి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

You might also like