FbTelugu

‘గాంధీ’ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా మృతుల వివరాలను బయటపెట్టడం లేదనని ఆయన అన్నారు.

మృతుల వివరాలు చెప్పకపోవడం మూలంగా మరికొందరికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల చికిత్సపై గాంధీ సూపరింటెండెంట్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే స్పందించ లేదని అన్నారు. ఎమ్మెల్యేకు స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉన్న గాంధీ సూపరింటెండెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

You might also like