FbTelugu

కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.50 లక్షలు !

250-lakh-for-intercaste-marriage

హైదరాబాద్‌ ; కులాంతర వివాహం చేసుకున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2.50లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ . 50 వేలు ఇస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ 2.50లక్షలకు పెంచారు. సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ లచ్చిరాం భూక్యాలతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ అలాగే దళితులకు భూపంపిణీ కోసం పట్టణ పరిధి తక్కువగా ఉన్న 20 జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసంగా 500 ఎకరాలు గుర్తించి ఇందులో 250 ఎకరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. పట్టణ పరిధి ఎక్కువగా ఉండే 10 జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసం 100 ఎకరాల భూమిని గుర్తించి 3 ఎకరాల చొప్పున లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు అయన చెప్పారు. ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో వ్యవసాయం చేసేందుకు గానూ విద్యుత్తు కనెక్షన్లు, నీటి సౌకర్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

You might also like